Share News

హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలి

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:49 PM

వాహ నదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద బొంకూర్‌లో రూరల్‌ ఎస్‌ఐ మల్లేష్‌ ఆధ్వర్యంలో అరైవ్‌ - అలైవ్‌ కార్యక్రమం ఏర్పాటుచేశారు. డీసీపీ, ఏసీపీ గజ్జి కృష్ణలు హాజరయ్యారు.

హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలి

పెద్దపల్లి రూరల్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): వాహ నదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద బొంకూర్‌లో రూరల్‌ ఎస్‌ఐ మల్లేష్‌ ఆధ్వర్యంలో అరైవ్‌ - అలైవ్‌ కార్యక్రమం ఏర్పాటుచేశారు. డీసీపీ, ఏసీపీ గజ్జి కృష్ణలు హాజరయ్యారు. గ్రామంలో ప్రమాదాల బారినపడిన కుటుంబాలతో, వారి స్థితిగతులపై ప్రజలకు కుటుంబ సభ్యులతో వివరించారు. అనంతరం డీపీసీ రాంరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్డు భద్రత వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతు న్నట్లు తెలిపారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భధ్రత నియమాలు పాటించాలని, వాహనాలకు ఇన్సూరెన్స్‌, పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠినచర్యలు తీసుకోవడంతో పాటు మీ వల్ల మరో కుటుంబం రోడ్డు పాలవుతుందని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే వాహ నాలు నడుపాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోని ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భధ్రత పాటిం చి ప్రమాదాల నివారణకు సహకరిం చాలన్నారు. అనంతరం గ్రామస్థు లతో భధ్రత వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ అనిల్‌కుమార్‌, సర్పంచ్‌ తిరుపతి, కొత్తపల్లి సర్పంచ్‌ రిబ్కా సంతోష్‌, ఉపసర్పంచ్‌ మిట్టపల్లి వెంకటేష్‌, వార్డుస భ్యులు, ఆటో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:49 PM