Share News

నేరస్థులకు శిక్షపడడంలో లైజనింగ్‌ అధికారులదే కీలకపాత్ర

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:05 AM

నేరస్థులకు శిక్షలు పడడంలో కోర్టు డ్యూటీ, లైజనింగ్‌ అధికారుల పాత్ర కీలకమని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. శనివారం కమిషనరేట్‌లో సమీక్ష సమా వేశంలో పలు సూచనలు చేశారు. కేసుల దర్యాప్తు, చార్జిషీట్‌ దాఖలు, కోర్టు విచారణ, సాక్షుల హాజరు అంశంలో అధికారులు నిబంధనలు పాటించాలన్నారు.

నేరస్థులకు శిక్షపడడంలో లైజనింగ్‌ అధికారులదే కీలకపాత్ర

కోల్‌సిటీ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యో): నేరస్థులకు శిక్షలు పడడంలో కోర్టు డ్యూటీ, లైజనింగ్‌ అధికారుల పాత్ర కీలకమని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. శనివారం కమిషనరేట్‌లో సమీక్ష సమా వేశంలో పలు సూచనలు చేశారు. కేసుల దర్యాప్తు, చార్జిషీట్‌ దాఖలు, కోర్టు విచారణ, సాక్షుల హాజరు అంశంలో అధికారులు నిబంధనలు పాటించాలన్నారు. విచారణకు వచ్చే కేసులను గుర్తించి సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు సమాచారం అందించాలని, సాక్షులకు ట్రయల్‌కు ముందే బ్రిఫింగ్‌ చేయాలని సూచించారు. ఏసీపీలు, పీపీలు, కోర్టు లైజనింగ్‌ అధికారులతో సమన్వ యం చేసుకుంటూ సాక్షులను కోర్టులో ప్రవేశపె ట్టాలన్నారు. సమన్లు, వారెంట్లు, సీసీడీల వివరాలను ఎప్పకటిప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని, తీర్పు కాపీలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. నిందితులకు శిక్ష పడే విధంగా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి సాక్ష్యా ధారాలను కోర్టులో ప్రవేశపెట్టాలన్నారు. కోర్టు ప్రాంగణంలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని, విధుల నిర్వహణలో ప్రతి ఒక్కరూ పారదర్శకతతో వ్యవ హరించాలన్నారు. దోషులకు శిక్షలు పడడంలో కీలకంగా వ్యవహరించిన కోర్టు డ్యూటీ సిబ్బంది, లైజనింగ్‌ అధికారులకు సీపీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) కే శ్రీనివాస్‌, తాండూరు సీఐ దేవయ్య, లైజనింగ్‌ ఆఫీసర్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ అనీల్‌ కుమార్‌, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, ఎస్‌ఐ వినీత, ఐటీ కోర్‌ ఎస్‌ఐ సంతోష్‌, సీసీ సందీప్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:05 AM