Share News

అవినీతి ప్రశ్నిస్తే పోలీస్‌ కేసులతో వేధింపులు

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:59 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఆర్టీఐ ద్వారా తెలుసుకుని వివరాలతో ప్రశ్నిస్తే బీజేపీ నాయకులపై దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ప్రశ్నించారు.

అవినీతి ప్రశ్నిస్తే పోలీస్‌ కేసులతో వేధింపులు

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఆర్టీఐ ద్వారా తెలుసుకుని వివరాలతో ప్రశ్నిస్తే బీజేపీ నాయకులపై దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ప్రశ్నించారు. సుల్తానాబాద్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ నాయకులు షబ్బీర్‌ అలీ అవినీతి బయటపెడితే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడి చేయించారని, ఎమ్మెల్యేపై అక్రమ కేసు బనాయించారని, పరామర్శకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాష్ట్ర అధ్యక్షులను పోలీసులతో గృహ నిర్బంధం చేయించారన్నారు. అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే నిరూపించుకోవాలని ఇలా హింసాత్మక దాడులకు దిగడం సరికాదన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్‌, మిట్టపల్లి ప్రవీణ్‌ కుమార్‌, నూనె మహేష్‌ పటేల్‌, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు మెండె శంకరయ్య, ఎల్లంకి రాజు, కొల్లూరి సంతోష్‌, రాజేందర్‌ రెడ్డి, మల్క భాగ్యలక్ష్మి, ఎర్రం సంతోష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 11:59 PM