కార్మికులపై వేధింపులను సహించేది లేదు
ABN , Publish Date - Nov 29 , 2026 | 11:08 PM
సింగరేణిలో కార్మికుల హక్కులను కాలరాస్తూ, వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్న యాజమాన్య వైఖరిని తక్షణమే మార్చుకోవాలని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆదివారం హెచ్‌ఎంఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వీసులో ఇంకా రెండు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులను మెడికల్ బోర్డుల పేరుతో వేధించడం అన్యాయమన్నారు.
గోదావరిఖని, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కార్మికుల హక్కులను కాలరాస్తూ, వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్న యాజమాన్య వైఖరిని తక్షణమే మార్చుకోవాలని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆదివారం హెచ్‌ఎంఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వీసులో ఇంకా రెండు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులను మెడికల్ బోర్డుల పేరుతో వేధించడం అన్యాయమన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం కార్మికులపై అదనపు భారం మోపడమేనని, ఆర్‌జీ-1 ఏరియాలో ఖాళీగా ఉన్న క్లరికల్, టెక్నీషియన్, జనరల్ అసిస్టెంట్, ఎస్‌అండ్‌పీసీ తదితర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకుల ప్రోద్బలంతో కార్మికులపై అక్రమంగా చార్జిషీట్లు జారీ చేస్తూ వేధింపులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలని హెచ్చరించారు. ఆర్‌జీ-1 ఏరియా వర్క్‌షాప్‌లో జరిగిన కాపర్ దొంగతనం ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆర్‌జీ-1 ఏరియాలో మహిళా కార్మికులకు గౌరవప్రదమైన, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్‌జీ-1 వైస్ ప్రెసిడెంట్ అరెల్లి పోశం, నాయకులు కిరణ్, కే వెంకటేశ్వర్లు, దబ్బెట సతీష్, రామచందర్ రావు, కుమార్, దాసరి రాజశేఖర్, రజమణి, శ్రీనివాస్, శ్యామ్, రాజేష్, శ్రీకాంత్, సాగర్ పాల్గొన్నారు.