ఆరోగ్యకరమైన జీవనం కోసం ‘హ్యాపీసండే’
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:48 PM
ఆరోగ్యకరమైన జీవనం కోసం హ్యాపీ సండే కార్యక్రమం అవసరమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు డిజిటల్ స్ర్కీన్స్‌కు అలవాటు పడి శారీరక, మానసిక సామర్ధ్యాన్ని కోల్పోతున్నారన్నారు.
కోల్‌సిటీ, జూన్ 7(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన జీవనం కోసం హ్యాపీ సండే కార్యక్రమం అవసరమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు డిజిటల్ స్ర్కీన్స్‌కు అలవాటు పడి శారీరక, మానసిక సామర్ధ్యాన్ని కోల్పోతున్నారన్నారు. యోగా, క్రీడలలో ప్రజలు భాగస్వా ములు కాకపోవడం వలన రోగాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరు గుతూ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన దుస్థితి తలెత్తుతుందన్నారు. ఆరోగ్యంపై ఇప్పటికే కొంత ప్రజల్లో చైతన్యం వచ్చిందని, నగరంలోని మైదానాలలో చాలా మంది కనిపిస్తున్నారని, ఇది శుభ పరిమాణమన్నారు. మెప్మా సిబ్బంది సహకారంతో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో పాటు అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. యోగాతో పాటు కబడ్డీ, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమ తులు ప్రదానం చేశారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కమిషనర్ అరుణశ్రీ, టీపీఎస్ నవీన్, సూపరింటెం డెంట్ పబ్బాల శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక, యోగా గురు గణేష్, వ్యాయమ ఉపాధ్యాయులు శోభారాణి ,తిరుపతి, దావీద్, సిఓలు, ఆర్‌పీలు, సిబ్బంది పాల్గొన్నారు.