సింగరేణిలో సగం మంది కారుణ్య ఉద్యోగులే...
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:50 PM
సింగ రేణిలో సగం మంది కారుణ్య ఉద్యోగులేనని, బీఆర్‌ఎస్ పదేళ్లపాలనలో కారుణ్య నియామ కాల పేర 19,500మంది ఉద్యోగాలు పొందారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. టీబీజీకే ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్‌టీపీసీలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో నినాదంతో సింగరేణి పరిరక్షణ సద స్సుకు ఆయన హాజరయ్యారు.
గోదావరిఖని, జూన్ 7(ఆంధ్రజ్యోతి): సింగ రేణిలో సగం మంది కారుణ్య ఉద్యోగులేనని, బీఆర్‌ఎస్ పదేళ్లపాలనలో కారుణ్య నియామ కాల పేర 19,500మంది ఉద్యోగాలు పొందారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. టీబీజీకే ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్‌టీపీసీలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో నినాదంతో సింగరేణి పరిరక్షణ సద స్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భం గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. లక్ష 30వేల మంది కార్మికులతో కళకళలాడిన సింగ రేణిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గోల్డెన్‌షేక్ హ్యాండ్ తెచ్చి సగం మంది కార్మికు లను సంస్థకు దూరం చేశారన్నారు. చంద్ర బాబు బాటలో నడిచే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మళ్లీ గోల్డెన్ షేక్ హ్యాండ్‌ను తెరమీదికి తెస్తు న్నదని ఆరోపించారు. ఇప్పుడు 38వేల మంది కార్మికులు సింగరేణిలో ఉంటే అందులో సగం మంది కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు పొందిన వారేనని హరీష్‌రావు చెప్పారు. సింగరేణి లేకుం టే రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధ్యం కాదని, లక్షలాది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోతా యని పేర్కొన్నారు. సింగరేణిని కాపాడుకో వాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌కు, సింగరేణి కార్మికు లకు ఉందని, కాంగ్రెస్‌కు అవసరం లేదన్నారు. ఓబీ, సోలార్, ఎక్స్‌ప్లోరేషన్, మిస్సింగ్ కోల్, జైపూర్ పవర్ ప్లాంట్, నైనీబ్లాక్, రాజస్థా న్‌తో ఒప్పంద అన్నీంటిలో కాంగ్రెస్ ప్రభుత్వం అవి నీతికి పాల్పడుతున్నదని ఆరోపించారు. సైట్‌వి జిట్ సర్టిపికెట్ లాంటి నిబంధనలు తీసు కువచ్చి వారి అనునాయకులకు కోట్ల రూపా యల టెండర్లను కట్టబెట్టే కుంభకోణాలు జరు గుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో టెండ ర్లలో మైనస్ రేట్లపై టెండర్లు ఖరారు అయితే కాంగ్రెస్ హయాంలో 10 నుంచి 20శాతం అధిక రేట్లపై టెండర్లు పడుతున్నాయన్నారు. 24 సంవత్సరాలుగా లాభాలు గడిస్తున్న సింగ రేణి ఈ సంవత్సరం నష్టాల వైపు నడుస్తున్న దని చెప్పారు. కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో డిపా జిట్లు కూడా రావన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చందర్‌రావు, నడి పెల్లి దివాకర్‌రావు, పుట్ట మధు పాల్గొన్నారు.