చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెంపు
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:45 PM
చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. మంగళవారం 3వ డివిజన్ ప్రశాం త్‌నగర్‌లో రూ.2.53 కోట్లతో చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
జ్యోతినగర్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. మంగళవారం 3వ డివిజన్ ప్రశాం త్‌నగర్‌లో రూ.2.53 కోట్లతో చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ చెరువు పునరుద్ధరణతో ఈ ప్రాంత ప్రజలకు దీర్ఘకాలిక ప్రయో జనాలు చేకూరుతాయని, చెరువులు కేవలం నీటి నిల్వ కేంద్రాలే కాకుండా పర్యావరణ సమతుల్యానికి మూల స్తంభాలుగా నిలుస్తాయన్నారు. తాగునీటి సమస్య పరిష్కారమవుతుం దని, వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వన రులను సంరక్షిస్తామన్నారు. చెరువు శుద్ధి, గట్టును బలపర్చడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా పరిసర ప్రాంతాలు అందంగా ఉంటాయని, ఆహ్లాదమైన వాతావరణం అందించడమే కాకుండా పర్యా వరణ పరిరక్షణకు ఒక మోడల్‌గా నిలుస్తుం దన్నారు. మేయర్ మహం కాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు వడ్లూరి రవి, దూళికట్ట సతీష్, కొలని కవితారెడ్డి పాల్గొన్నారు.