Share News

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు సజావుగా కొనసాగేలా చూడాలి

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:48 PM

రైతులు, నిర్వాసితులకు సం బంధించిన సమస్యలను పరిష్కరిస్తూ మంచిర్యాల-వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు సజావుగా కొనసాగేలా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు ఆటంకాలు లేకుండా అవ సరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు   సజావుగా కొనసాగేలా చూడాలి

ముత్తారం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రైతులు, నిర్వాసితులకు సం బంధించిన సమస్యలను పరిష్కరిస్తూ మంచిర్యాల-వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు సజావుగా కొనసాగేలా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు ఆటంకాలు లేకుండా అవ సరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో హైవే నిర్మాణ పనుల పురోగతి, భూసేకరణ, నిర్వాసి తులకు పరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. మంచిర్యాల-వరంగల్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లిం పుల సమస్యల కారణంగా క్షేత్రస్థాయిలో పనులకు ఆటంకాలు ఏర్పడు తున్నట్లు హైవే అధికారులు తెలిపారన్నారు. పోతారం, సర్వారం, ఓడేడు, లక్కారం ప్రాంతాలకు చెందిన రైతులు, నిర్వాసితుల సమస్యలను తెలు సుకున్నారు. టైటిల్‌ క్లియర్‌గా ఉన్న రైతులకు సంబంధించి పరిహారం చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైవే నిర్మాణ పనులకు ఆటంకాలు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులు, నిర్వాసితులకు సంబం ధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి నిబంధనల ప్రకారం పరి ష్కరించాలని, సమస్యల కారణంగా జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోకుండా దృష్టి సారించాలని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అనంతరం పోతారంలో జరుగుతున్న హైవే నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. మంథని ఆర్డీవో సురేష్‌, తహసీల్దార్‌ మధుసూదన్‌ రెడ్డి, సీఐ బుద్దె స్వామి, ఎస్‌ఐ రవికుమార్‌ అధికారులు, రైతులు, నిర్వాసితులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:48 PM