చిలుకపచ్చ చీరలు వస్తున్నాయ్..
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:36 AM
ఈసారి బతుకమ్మ పండుగ వరకు ఆడపడుచులకు చీరలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం ‘పాలపిట’్ట రంగు చీరలు మహిళకు పంపి ణీ చేశారు. ఈసారి ‘చిలకపచ్చ’ రంగులు చీరలను సిద్ధం చేశారు. బతుకమ్మ పండుగకి సర్కారు సారెగా ఇందిరా మహిళా శక్తి పేరుతో పంపిణీ కోసం చీరలను జిల్లాలకు చేరవేస్తున్నారు.
(ఆంరఽధజ్యోతి, సిరిసిల్ల)
ఈసారి బతుకమ్మ పండుగ వరకు ఆడపడుచులకు చీరలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం ‘పాలపిట’్ట రంగు చీరలు మహిళకు పంపి ణీ చేశారు. ఈసారి ‘చిలకపచ్చ’ రంగులు చీరలను సిద్ధం చేశారు. బతుకమ్మ పండుగకి సర్కారు సారెగా ఇందిరా మహిళా శక్తి పేరుతో పంపిణీ కోసం చీరలను జిల్లాలకు చేరవేస్తున్నారు. ఈసారి స్వశక్తి మహిళలతో పాటు 18 సంవత్సరాల నిండిన యువతులకు, స్వశక్తి సంఘాల్లో సభ్యులు కాని మహిళలకు కూడా అందిం చాలని నిర్ణయించారు. ముందుగా స్వశక్తి సంఘాల్లో పంపిణీ ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నారు. రాజ న్న సిరిసిల్ల జిల్లాలో 1.11 లక్షల మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో 411 గ్రామైక్య సంఘాలు, 10853 స్వశక్తి సంఘాల్లో 1.11 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరితో పాటు మరో 30వేల మంది మహిళా సంఘాలకు సంబంధం లేకుండా ఉన్నారు. వీరందరికీ చీరలు పంపిణీ చేయడం కోసం 1.40 లక్షల చీరలు అవసరం అవుతాయని ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. జిల్లాకు ఇప్పటివరకు 68 వేల చీరలు వచ్చాయి. వీటిని గోడౌన్‌లో భద్రపరిచారు. మిగిలిన చీరలు మరో వారం రోజుల్లో వస్తాయని భావిస్తున్నారు. వచ్చిన చీరలతో బతుకమ్మ పండుగ వరకే పంపిణీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో పాలపిట్ట రంగు చీరల కోసం మహిళలు ఎదురుచూ డాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి మహిళలకు ఎదురుచూపులు లేకుండా పకడ్బందీగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. చీరల పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సమన్వయం చేసుకునేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు.
సిరిసిల్లలో బట్ట ఉత్పత్తి
సిరిసిల్ల పవరూలూమ్ కార్మికులకు చేతినిండా పని కల్పించే దిశగా గత ప్రభుత్వ హయాంలో 2017 నుంచి 2023 సంవత్సరం వరకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. అనేక విషాద సంఘటనల మధ్య మళ్లీ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వశక్తి మహిళలకు నాణ్యమైన చీరలు అందించే ప్రక్రియను గత సంవత్సరం ప్రారం భించింది. సిరిసిల్లలో 30 వేలకు పైగా మరమగ్గాలు ఉండగా ఇందులో దాదాపు 10 వేల మరమగ్గాలపై స్వశక్తి చీరల ఉత్పత్తి జరుగుతోంది. దీంతో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు గత సంవత్సరం 132 మ్యాక్స్ సంఘాలకు 6.97 లక్షల మీటర్లు చీర బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. ఈసారి కూడా 133 మ్యాక్స్ సంఘా లకు 6.33 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వగా ఇప్పటివరకు 4.50 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి పూర్తి చేశారు. ఉత్పత్తి అయిన బట్ట చిలకపచ్చ రంగులు అద్దిన రంగుల చీరలు జిల్లాలకు చేరుకుంటున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు స్వశక్తి చీరల ఉత్పత్తి ద్వారా ఉపాధి పొందడానికి సిరిసిల్ల కార్మికులతో పాటు జగిత్యాల, వరంగల్, నల్లగొండ, వికారాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా కార్మికులు వచ్చి ఉపాధి పొందుతున్నారు.
జిల్లాలో స్వశక్తి సంఘాల సభ్యులు
మండలం స్వశక్తి సంఘాలు సభ్యులు
బోయిన్‌పల్లి 890 9449
చందుర్తి 837 8527
ఇల్లంతకుంట 1221 12514
గంభీరావుపేట 1234 12338
కోనరావుపేట 1111 11656
ముస్తాబాద్ 427 4528
రుద్రంగి 1175 11719
వీర్నపల్లి 390 4091
వేములవాడ 480 4711
వేములవాడ రూరల్ 550 5801
ఎల్లారెడ్డిపేట 1258 125578
మొత్తం 10853 111252