డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయండి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:58 PM
పెద్దపల్లి పట్టణానికి చెందిన తనకు డబుల్ బెడ్ రూము ఇళ్లు మంజూరు చేయాలని ఎండీ షబానా డీఆర్‌వో రాజేశ్వరిని కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ఆమె దరఖాస్తు చేసుకోగా హౌసింగ్ ఈఈకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
పెద్దపల్లి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణానికి చెందిన తనకు డబుల్ బెడ్ రూము ఇళ్లు మంజూరు చేయాలని ఎండీ షబానా డీఆర్‌వో రాజేశ్వరిని కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ఆమె దరఖాస్తు చేసుకోగా హౌసింగ్ ఈఈకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన బి శంకర్ దివ్యాంగుల కోటాలో వీల్ చైర్ ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా డీఆర్‌డీవోకు ఆదేశాలు జారీ చేశారు. అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన రవికుమార్ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న వాచ్‌మన్ పోస్టు ఇప్పించాలని కోరగా, వారధి సొసైటీకి ఆ దరఖాస్తును పంపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని, ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండకూడ దన్నారు. అధికారులు కలెక్టరేట్ ఏఓ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.