Share News

సింగరేణిలో ఘనంగా వేడుకలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:28 AM

ఆర్‌జీ-1 జీఎం కార్యాలయ ఆవరణలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జీఎం లలిత్‌ కుమార్‌ జెండాను ఎగురవేశారు. అనంతరం పరేడ్‌ చే గౌరవ వందనం స్వీకరించారు.

 సింగరేణిలో ఘనంగా వేడుకలు

గోదావరిఖని, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఆర్‌జీ-1 జీఎం కార్యాలయ ఆవరణలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జీఎం లలిత్‌ కుమార్‌ జెండాను ఎగురవేశారు. అనంతరం పరేడ్‌ చే గౌరవ వందనం స్వీకరించారు. జీఎం మాట్లాడుతూ ఆర్‌జీ-1 ఏరియా ఉత్పత్తి ఉత్పాదకతా, చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. విద్యార్థిని విద్యార్థులు చేసిన దేశభక్తి సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. సేవా అధ్యక్షురాలు డీ అనిత లలిత్‌ కుమార్‌, క్వాలిటీజీఎం జే వెంకటరమణ, సీఎంఓఏఐ ప్రతినిధి కోల మల్లేశం, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ మడ్డి ఎల్లగౌడ్‌, బ్రాంచి సెక్రటరీ రంగు శ్రీనినివాస్‌, ఎస్‌ఓటు జీఎం చంద్రశేఖర్‌, పర్సనల్‌ మేనేజర్‌ రెడ్డిమల్ల తిరుపతి, ఏరియా ఇంజనీరు రాజాజీ, ప్రాజెక్ట్‌ అధికారి రమేష్‌, ఏజెంట్స్‌ చిలక శ్రీనివాస్‌, ఎల్‌ రమేష్‌, డిజీఎం వర్క్‌షాప్‌ జితేందర్‌ సింగ్‌, డీజీఎం ఫారెస్ట్‌ కర్ణ, ఏరియ సెక్యురిటి అధికారి వీరారెడ్డి, డీవైపీఎం వేణు, సినియర్‌ పీఓలు శ్రావణ్‌ కుమార్‌, హనుమంతరావు, అన్ని గనుల మేనేజర్లు, ఫిట్‌ సెక్రటరీలు, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 12:28 AM