కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:10 AM
రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు కాకుండా చేస్తూ కిలో కటింగ్ లేకుండా కొనుగోళ్లు చేస్తోంది పెద్దపల్లి నియోజకవర్గంలోనే అని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు కాకుండా చేస్తూ కిలో కటింగ్ లేకుండా కొనుగోళ్లు చేస్తోంది పెద్దపల్లి నియోజకవర్గంలోనే అని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, దుబ్బపల్లి, ఐతురాజుపల్లి, గర్రెపల్లి, బొంతకుంటపల్లి తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రైతులకు చేసేందుకు ఎలాంటి కటింగ్‌లు లేకుండా మిల్లర్ల నుంచి కేంద్రాల నిర్వాహకుల నుంచి రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు జరిపిస్తున్నట్లు వివరించారు. మండలంలో ఇప్పటి వరకు రూ.16 కోట్ల బోనస్ రైతులకు ఇచ్చామన్నారు. గతంలో పది నుంచి పదిహేను కిలలో మేరకూ కటింగ్‌లు చేసిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వ నిబందనల మేరకు తేమ శాతం వచ్చేలా రైతులు చూసుకోవాలని, వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా అధికారులు అందుబాటులో ఉంటూ కవర్లు ఇస్తారన్నారు. అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు,ఆయా గ్రామాల సర్పంచులు, వ్యవసాయ అధికారి, కిసాన్ సెల్ అధ్యక్షులు పన్నాల రాములు, చిలుక సతీష్, కల్లెపల్లి జానీ, పడాల అజయ్ తదితరులు పాల్గొన్నారు.