జిల్లాలో పుంజుకున్న ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - May 24 , 2026 | 12:03 AM
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కాస్త ఆలస్యం అయినా వేగం పుంజుకుంటున్నాయి. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారుల నిరంతర పర్యవేక్షణతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తుండడంతో కొనుగోళ్లలో వేగం పెరి గింది. క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురైనప్పటికీ, వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ, రోజుకు కనీసం 15 వేల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇదే సమయానికి 42 వేల టన్నులు వెనుకబడినప్పటికీ వేగం పెరిగింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కాస్త ఆలస్యం అయినా వేగం పుంజుకుంటున్నాయి. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారుల నిరంతర పర్యవేక్షణతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తుండడంతో కొనుగోళ్లలో వేగం పెరి గింది. క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురైనప్పటికీ, వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ, రోజుకు కనీసం 15 వేల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇదే సమయానికి 42 వేల టన్నులు వెనుకబడినప్పటికీ వేగం పెరిగింది.
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో లక్షా 92 వేల ఎక రాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఎక్కువగా దొడ్డు రకాలనే సాగు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 334 కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. తద్వారా 4 లక్షల 50 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగిలో పండించే వరి ఎక్కువగా నూక అవుతుంది రైతులు మొత్తం పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరలు పొం దుతారు. జిల్లాలో 250కి పైగా రైస్‌మిల్లులు ఉండగా, 114 మిల్లులకు ధాన్యం ఇవ్వాలని కలెక్టర్, పౌరసరఫ రాల శాఖాధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 2,91,412 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఇందులో గ్రేడ్ ఏ రకం 2,734 టన్నులు, కామన్ రకం 2,88,677 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 690కోట్ల 55లక్షల రూపాయలకు గాను రైతుల ఖాతాల్లో 82శాతం 565కోట్ల 59లక్షల రూపాయలు జమ చేశారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. గత ఏడాది ఇదే సమ యానికి 3,34,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అప్పుడు పంట కోతలు ముందుగా జరగడం వల్ల ఏప్రిల్ రెండో వారంలోనే కేంద్రాల్లో కొనుగోళ్లు ఆరంభించారు. ఈసారి ఏప్రిల్ 20వ తేదీ తర్వాత కొనుగోళ్లను ఆరంభించారు. అయితే ఈసారి కొనుగోలు కేంద్రాలకు రైస్‌మిల్లులను అలాట్‌మెంట్ చేయకుండా, ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే మిల్లులు అలాట్ అయ్యే విధంగా నూతన విధానాన్ని ప్రభుత్వం తీసుక వచ్చింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వెంటనే ధాన్యాన్ని ఏ రైస్ మిల్లుకు తరలించాలో ఆటోమేటిక్‌గా మిల్లు పేరు వస్తుంది. దీంతో అదే మిల్లుకు ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. గతంలో ఒక కేంద్రంలో కొనుగోలు చేసే ధాన్యాన్ని ఒకటి, రెండు రైస్‌మిల్లులకు తరలించేందుకు అలాట్‌మెంట్ చేసే వాళ్లు. ఈ విధానం వల్ల త్వరగా ట్రక్ షీట్లు ఇవ్వడం లేదని, తరుగు పేరిట ధాన్యంలో కోతలు విధిస్తున్నారని భావించిన ప్రభుత్వం కొత్త విధా నాన్ని తీసుకవచ్చింది. దీంతో కొనుగోళ్లు ఆరంభమైన మొదటి వారం రోజుల నూతన విధానం వల్ల ఇబ్బం దులు ఏర్పడడం, రైస్‌మిల్లర్లు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని దించుకోకుండా కొర్రీలు విధించడంతో కొను గోళ్లలో వేగం తగ్గింది. రైతులు గగ్గోలు పెట్టడంతో ప్రభు త్వం పాత విధానంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేయా లని కేంద్రాలకు రైస్‌మిల్లులు కేటాయించాలని ఆదే శించింది. ఆ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖాధికా రులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని కేటాయించారు.
రైస్‌మిల్లుల్లో స్థలం లేక ఇక్కట్లు..
యాసంగి సీజన్‌కు కేటాయించిన రైస్‌మిల్లుల్లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరిపడా గోడౌన్లు లేకపో వడంతో అన్‌లోడింగులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వానాకాలం సీజన్‌కు సంబంఽధించి సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యం నిల్వలు కూడా మిల్లుల్లోనే ఉన్నాయి. ఆయా రైస్‌మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యాన్ని ఇచ్చారు. మిల్లింగ్ జరుగుతున్నా కూడా నిల్వలు తగ్గు ముఖం పట్టడం లేదు. అవే రైస్‌మిల్లుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ధాన్యం దించుకుంటున్నారు. ఈ సీజన్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష మిల్లులను సందర్శించి వాటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో కొనుగోళ్లలో వేగం పెరిగింది. వాతావరణం అనుకూలించి పంట దిగుబడులు అధికంగా వచ్చాయి. అందుకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరణకు అనుమతులు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల టన్నుల ధాన్యం సేకర ణకే అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమని తెలుస్తున్నది. ఇంకా చాలా కేంద్రాల్లో ధాన్యం నిల్వలున్నాయి. మరో 15 రోజులపాటు కొను గోలు కేంద్రాలు నడుస్తాయని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటి, పరి శ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.