గౌడ జన హక్కుల కోసం పోరాడాలి
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:44 PM
సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు, జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఆదివారం రాఘవపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో గెలుపొందిన సుమారు 206 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు, 56 మంది జర్నలిస్టులను సన్మానించారు.
పెద్దపల్లి రూరల్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు, జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఆదివారం రాఘవపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో గెలుపొందిన సుమారు 206 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు, 56 మంది జర్నలిస్టులను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన టాడి టాపర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ మాట్లాడుతూ గీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్రప్రభుత్వం అమలు చేసే దిశగా పోరాటం చేయాలన్నారు. తాటి చెట్టుపై నుంచి పడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం అందించకపోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయని, వెంటనే ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలని కోరారు. గౌడ కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడే ఇతరులకు న్యాయం చేయగలుగుతారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారి తనంగా పని చేస్తే భవిష్యత్తు ఉంటుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి గోపగాని సారయ్య గౌడ్, భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, రాజమౌళి గౌడ్, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, నిర్వాహకులు జాగిరి అంజన్ కుమార్, బాలసాని ఈశ్వర్ గౌడ్, బాలసాని పరశురాముడు గౌడ్, పడాల సతీష్ గౌడ్, బండారి సునీల్ గౌడ్, భూషణ వేణి సురేష్ గౌడ్, బాలసాని వెంకటేశం పాల్గొన్నారు.