వ్యవసాయ రంగాన్ని కాపాడడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:25 PM
వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, సామాజిక కార్యకర్త ఏలేశ్వరం వెంకటేష్ ఆరోపించారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల ముందు 41 డిమాండ్లతో రూపొందించిన కరపత్రాన్ని ఆదివారం గోదావరిఖనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఆవిష్కరించారు.
కోల్సిటీటౌన్, నవంబర్ 22(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, సామాజిక కార్యకర్త ఏలేశ్వరం వెంకటేష్ ఆరోపించారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల ముందు 41 డిమాండ్లతో రూపొందించిన కరపత్రాన్ని ఆదివారం గోదావరిఖనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగం కుదేలవుతోందన్నారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. రైతులంతా ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తేనే వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి 41 డిమాండ్లతో రూపొందించిన కరపత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుల ముత్తయ్య, పల్లె లింగయ్య, సీహెచ్ ఐలయ్య, రాజు పాల్గొన్నారు.