రిజర్వేషన్లు అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:27 PM
దళితులకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభు త్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఐ జిల్లా కార్య దర్శి, తాండ్ర సదానందం, దళితహక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ళపల్లి లక్ష్మయ్యలు పేర్కొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా రెండో మహాసభ జిల్లా కేంద్రంలో ఆదివారం కందుకూరి రాజారత్నం అధ్యక్షతన జరిగాయి.
పెద్దపల్లిటౌన్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): దళితులకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభు త్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఐ జిల్లా కార్య దర్శి, తాండ్ర సదానందం, దళితహక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ళపల్లి లక్ష్మయ్యలు పేర్కొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా రెండో మహాసభ జిల్లా కేంద్రంలో ఆదివారం కందుకూరి రాజారత్నం అధ్యక్షతన జరిగాయి. వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిన ప్రభుత్వాలు పైవ్రేటు రంగాలలో రిజర్వేషన్లు కల్పించుటకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రిజర్వేషన్‌లో ఉనికికే ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు దళితుల అభి వృద్ధికి చట్టబద్ధంగా నిధులు కేటాయించ లేద న్నారు. కేటాయించిన నిధులను కూడా దళితుల అభివృద్ధికి ఉపయోగించకుండా ఇతర పథకాలకు మళ్ళిస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లపై స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఈ కేసులను చట్టపరంగా కఠినంగా శిక్షలు విధిస్తేనే దళితు లపై జరుగుతున్న దాడులు పునరావృతం కాకుం డా ఉంటాయన్నారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పనితీరు ఆమోద యోగ్యంగా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి మేనిఫెస్టోలో పెట్టిన అంబేద్కర్ హస్తం కింద దళితులకు 12 లక్షల రూపాయలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఇండ్లు లేని పేదలు దళితులే దాదాపు నూటికి 80 శాతం ఉన్నారని, మొదటి ప్రాధాన్యం దళితులకు ఇవ్వా లన్నారు వరంగల్‌లో ఏప్రిల్ 17, 18 తేదీలలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర రెండో మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.