దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - May 20 , 2026 | 11:34 PM
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో 20 మంది లబ్ధిదారులకు ఉచితంగా మోటార్ ట్రైసైకిళ్లను అందజేశారు.
కళ్యాణ్‌నగర్, మే 20(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో 20 మంది లబ్ధిదారులకు ఉచితంగా మోటార్ ట్రైసైకిళ్లను అందజేశారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఉచిత వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి వారి స్వావలంబనకు దోహదపడుతుందన్నారు. ప్రతీ కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళళతుందన్నారు. దివ్వాంగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే దిశగా నిరంతరం కృషి కొనసాగుతుందన్నారు. వాహనాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ మహాంకాళిస్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.