సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:58 PM
ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారు. రూ.12 కోట్లతో నిర్మించిన ఓదెల, పెగడపల్లి ఫోర్‌లేన్‌లో రోడ్డులో భాగంగా సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చారు.
ఓదెల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారు. రూ.12 కోట్లతో నిర్మించిన ఓదెల, పెగడపల్లి ఫోర్‌లేన్‌లో రోడ్డులో భాగంగా సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చారు. ప్రభుత్వ విప్‌గా నియమితులైనట్లు ఆలయ సమీపంలోనే సమాచారం తెలుసుకున్న విజయరమణరావు హర్షం వ్యక్తం చేస్తూ పూజలు నిర్వహించారు. అంతకుముందు ప్రధాన అర్చకులతోపాటు చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య ధర్మకర్తలు, అర్చకులంతా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌గా ప్రకటించినందుకు సన్మానించారు. పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌సాగర్ రెడ్డి, సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు బోడకుంట శంకర్, పెర్క సంఘం అధ్యక్షుడు ఎర్ర శంకరయ్య, ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు రెడ్డి రజనీకాంత్, నాయకులు చొప్పరి రాజయ్య, బోడకుంట చిన్నస్వామితో పాటు మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.