ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:28 PM
ప్రభు త్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళా లని, రామగుండంను రాష్ట్రంలోనే నెంబర్ స్థానంలోకి తీసుకెళుతానని ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ప్రగతి ప్రణా ళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా 60 డివిజన్ల క్లస్టర్ స్థాయి వార్డు సభను గురు వారం ఆర్‌సీఓఏ క్లబ్‌లో మేయర్ అధ్యక్షతన నిర్వహించారు.
కోల్‌సిటీ, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళా లని, రామగుండంను రాష్ట్రంలోనే నెంబర్ స్థానంలోకి తీసుకెళుతానని ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ప్రగతి ప్రణా ళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా 60 డివిజన్ల క్లస్టర్ స్థాయి వార్డు సభను గురు వారం ఆర్‌సీఓఏ క్లబ్‌లో మేయర్ అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నగరంలో రూ.800కోట్ల నిధు లతో డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాలను ఏర్పా టు చేశామని, ఐదు దశాబ్దాల కాలంలో జరుగని పనులను రామగుండంలో చేస్తున్న ట్టు చెప్పారు. పరిసరాల పరిశుభ్రత పాటి స్తూ స్వచ్ఛ నగరంగా రూపొందించుకో వాలని, వర్షాకాలంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ముందస్తు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. మేయర్ మహం కాళి స్వామి మాట్లాడుతూ గతంలో పూడి కతీత పేరుతో కోట్లాది రూపాయలు దుర్వి నియోగం చేశారని, శానిటేషన్ సిబ్బందిని ఉపయోగించి వరద ప్రవాహంతో ముంపు నకు గురయ్యే ప్రాంతాల్లో డ్రైనేజీల వ్యవ స్థను మార్చినట్టు చెప్పారు. ఏసీపీ రమేష్, నగరపాలక సంస్థ ఏసీపీ శ్రీహరి, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అతుల్యనాయక్, మున్సిపల్ అధికారులు నవీన్, శ్రీనివాస్, ఆంజేనేయులు మెప్మా టీఎంసీ మౌనిక, ఆర్‌పీలు, స్వశక్తి మహిళలు, పాల్గొన్నారు.
కళ్యాణ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): గోదావరి ఖని బస్టాండ్‌లో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్‌టీసీ అధికారులకు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. రూ.20లక్షల వ్యయం తో బస్టాండ్‌లో సీసీ రోడ్డు విస్తరణ, బస్టాం డ్ రెనోవేషన్, ప్లాట్‌ఫాం మరమ్మతులు, పెయింటింగ్ పనులు, శానిటరీ పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లా డుతూ ప్రయాణీకులకు మెరుగైన వసతు లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్న దన్నారు. బస్టాండ్‌లో ప్రయాణీకులకు మౌ లిక వసతుల ఏర్పాటులో లోపాలు ఉం డవ ద్దని అధికారులను ఆదేశించారు. ప్రయాణీ కులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఆటోల పార్కింగ్ ఉండడంపై డీఎంపై అస హనం వ్యక్తంచేశారు. మేయర్ మహంకాళి స్వామి, నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు పద్మావతి, గడ్డం రమాదేవి, చిదురాల నాగరాజు, దూళికట్ట సతీష్, చుక్కల లావణ్య, తాళ్లపల్లి యుగంధర్, నెలకంటి రాము, ఉన్నారు.