ఆర్‌టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:48 PM
ఆర్‌టీసీ కార్మికుల సంక్షేమా నికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపోకు చెందిన కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు మిఠాయిలు తినిపించారు.
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ఆర్‌టీసీ కార్మికుల సంక్షేమా నికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపోకు చెందిన కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు మిఠాయిలు తినిపించారు. ఆయన మాట్లాడుతూ ఆర్‌టీసీ కార్మికుల చిరకాల కోరికను ప్రభుత్వం నెరవేర్చిందని, ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులకు 11శాతం పీఆర్‌సీ ఇవ్వడం, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం తోపాటు పలు సమస్యలను పరిష్కరించిందన్నారు. మేయర్ మహం కాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య పాల్గొన్నారు.