Share News

కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వ మద్దతు ధర

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:34 AM

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు.

కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వ మద్దతు ధర

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లా డుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేయనున్నట్లు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ధాన్యం తూకం లో కేవలం 41 కిలోలు ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా తేమశాతం ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ఉండాలన్నారు. పెద్దపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ ముత్యాల నరేష్‌,సర్పంచ్‌ ఆకుల సువర్ణశ్రీనివాస్‌, సీఈవో మెట్టు మధన్‌మోహన్‌, ప్రదీప్‌ పాల్గొన్నారు.

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): దళారులకు ధాన్యం విక్ర యించి మోసపోవద్దని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింత కుంట విజయ రమణరావు అన్నారు. శివపల్లిలో పీఏ సీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామ న్నారు. తుపాన్‌ దృష్ట్యా ధాన్యం తడువకుండా పాలి థిన్‌ కవర్లు కప్పుకోవాలని సూచించారు. సూపర్‌ ఎల్‌నినోని దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. పిఎసిఎస్‌ చైర్మన్‌ సామ రాజేశ్వర్‌ రెడ్డి, సర్పంచ్‌ దుగ్యాల వాణి గోపాల్‌ రావు, డైరెక్టర్లు అమ్ముల రాజు, ముంజం ముత్యాలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొట్యాల రమేష్‌, వైస్‌చైర్మన్‌ కోరుకంటి వెంకటేశ్వర్‌ రావు, దుగ్యాల సంతోష్‌ రావు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 12:34 AM