ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం నిర్లక్ష్యం
ABN , Publish Date - May 05 , 2026 | 12:06 AM
ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరెట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
పెద్దపల్లి టౌన్, మే 4 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరెట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అంద.జేశారు. ఆయన మాట్లాడుతూ ఒకవైపు మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం ఆశించిన స్థాయిలో సహకారం అందక అన్నదాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం పేరుతో దళారులు నిర్వహకులు రైతులను దోపిడీ చేస్తున్నారని, గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలన్న రైతుల ఆశలు నిరాశ అవుతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్ప పేరుకపోయాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎన్నో సమస్యలున్నాయని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు శిలావేరు ఓదెలు, నల్ల మనోహర్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.