Share News

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వివాదంపై ప్రభుత్వం జోక్యం

ABN , Publish Date - May 10 , 2026 | 11:47 PM

ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌ వివాదంపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యంతో మాట్లాడారు. కార్మికుల సమస్యలు, వీర్లపల్లి పునరావాసం, ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు యూరియా బ్యాగులను స్వశక్తిసంఘాల ద్వారా సరఫరా వంటి అం శాలు చర్చకు వచ్చాయి.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వివాదంపై ప్రభుత్వం  జోక్యం

కోల్‌సిటీ, మే 10(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌ వివాదంపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యంతో మాట్లాడారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీఈఓ సంజయ్‌ గులాటి, ప్రాజెక్టు హెడ్‌ (ఇన్‌చార్జి) ప్రేమ్‌కుమార్‌, డీజీఎం(హెచ్‌ఆర్‌) సోమనాథ్‌లతో ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబు, రామ గుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మాట్లాడారు. కార్మికుల సమస్యలు, వీర్లపల్లి పునరావాసం, ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు యూరియా బ్యాగులను స్వశక్తిసంఘాల ద్వారా సరఫరా వంటి అం శాలు చర్చకు వచ్చాయి. స్థానికులనే ఉద్యోగా ల్లోకి తీసుకోవాలని, ఇతర ప్రాంతాల వారికి అవకాశాలు ఇవ్వవద్దని మంత్రి సూచించారు. ఆర్‌ఎఫ్‌ సీఎల్‌లో 78శాతం వరకు స్థానికులే ఉన్నారని, కేవలం లోడింగ్‌ సెక్షన్‌లో త్వరిత గతిన లోడింగ్‌ అయ్యేందుకు బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ల నుంచి కాంట్రాక్టర్‌ కార్మికులను తెప్పించామని యాజమాన్యం పేర్కొన్నది. లోడింగ్‌ జాప్యమైతే రైల్వేశాఖ పెనాల్టీ వేస్తుందని, రైతాంగానికి యూరియా సరఫరాలో కూడా ఇబ్బందులు ఎదురవు తున్నాయంటూ పేర్కొన్నారు. లోడింగ్‌ సెక్షన్‌లో ఇతర ప్రాంతాల వారిని తగ్గించి స్థానికులకు ఇవ్వాలని మంత్రి ఆదేశిం చారు. అలాగే కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం సాను కూల దృక్పథంతో ఉండాలన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పరిశ్రమకు రాష్ట్ర ప్రభు త్వం అన్నీ రకాల సహకరిస్తుందని, రైతాంగానికి యూరి యా సరఫరా చేయడంలో కీలక పరిశ్రమ అయిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా నిర్వ హించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తొలగిం చిన కార్మికుల విషయంలో సానుకూలంగా వ్యహరిం చాలన్నారు. సింగరేణిలో మాదిరిగానే ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కూడా కాంట్రాక్టు కార్మికులకు రూ.50లక్షల బీమా పాలసీని అమలు చేసేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. వీర్లపల్లికి పునరావాసం కల్పించడం లో యాజమాన్యం చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కాగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ స్థానంలో పునరుద్ధరించడం వల్ల సీడీ ఫండ్‌ (కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) మం జూరు కాలేదని, అందువల్లే వీర్లపల్లి పునరా వాసం సాధ్యపడడం లేదని యాజమాన్యం పేర్కొన్నది. దీనిపై పరిష్కారా నికి కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని నిర్ణయిం చింది. కలెక్టర్‌ నివేదికకు అనుగు ణంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం కేంద్ర ఎరువుల మంత్రిత్వశా ఖతో సంప్రదిం చనున్నది.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు ఖాళీ బ్యాగులు సరఫరా చేసేందుకు స్వశక్తి సంఘా లకు బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యానికి సూచించా రు. భవిష్యత్‌లో రాష్ట్రప్రభుత్వ సహకారంతో స్వశక్తి సంఘాలు పరిశ్రమపెట్టుకుంటే సహకరించేందు కు యాజమాన్యం చొరవ చూపుతుందన్నారు. ఆర్‌ఎఫ్‌ సీఎల్‌ పరిశ్రమ ఇప్పటి వరకు సరాసరిగా నష్టాల్లోనే ఉన్నదని, ఈ ఏడాది నుంచి సీఎస్‌ఆర్‌ ప్రారంభ మవు తుందన్నారు. కార్మికులప్రమోషన్లు, తాగునీటి సౌకర్యం, రవాణా సౌకర్యం, రెస్ట్‌షెల్టర్లు, ఆసుపత్రి సౌకర్యం వంటి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామని సీఈఓ హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారుల వెంకటరెడ్డి, కృష్ణమూర్తి, మయాంక్‌ పాల్గొ న్నారు. ఆర్‌ఎ ఫ్‌సీఎల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నెలకంటి రాము, కాంగ్రెస్‌ నాయకులు కందుల సతీష్‌, రాజ్‌కుమార్‌, దబ్బెట మల్లేష్‌, మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2026 | 11:47 PM