Share News

విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:12 AM

వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, బీజేపీ రాష్ట్ర నాయకులు, మల్కా జిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. రైతులకు అవసరమైన విద్యుత్‌ను నిరంతరా యంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, బీజేపీ రాష్ట్ర నాయకులు, మల్కా జిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. రైతులకు అవసరమైన విద్యుత్‌ను నిరంతరా యంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సుల్తానాబాద్‌ - సుగ్లాంపల్లి 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఎదుట బుధవారం మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందుల కారణంగా రైతులు నష్ట పోతున్నారన్నారు. పంటలకు కీలకమైన సమ యంలో విద్యుత్‌ కోతలు ఏర్పడితే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై బీజేపీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. అనంతరం విద్యుత్‌ శాఖ డీఈకి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, టీచర్స్‌ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు కట్కూరి సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్‌, కాసగోని నిర్మల, జిల్లా కార్యదర్శి శివంగారి సతీష్‌, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు రామగిరి అఖిల్‌, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి లత, మన కీ బాత్‌ జిల్లా కన్వీనర్‌ మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్‌, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

Updated Date - Oct 01 , 2026 | 12:12 AM