ప్రమాద సమయంలో గోల్డెన్‌అవర్ కీలకం
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:17 AM
ప్రమాదం జరిగిన మొదటి గంటలో సరైన వైద్యం అందితే ప్రాణాలను కాపాడవచ్చునని డీసీపీ రాంరెడ్డి అన్నారు. అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులకు, వైద్య సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ప్రమాదం జరిగిన మొదటి గంటలో సరైన వైద్యం అందితే ప్రాణాలను కాపాడవచ్చునని డీసీపీ రాంరెడ్డి అన్నారు. అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులకు, వైద్య సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ప్రమాదాల అనంతరం తక్షణ వైద్య సహాయం అందించడం వల్ల బాధితులకు ప్రాణభిక్ష పెట్టవచ్చునని, ప్రమాద సమయంలో గోల్డెన్ హవర్ అత్యంత కీలకమని, వైద్య సిబ్బంది వేగవంతంగా స్పందించి అత్యవసర చికిత్స అందించడం, బాధితులను సమయానికి రెఫర్ చేయడంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య సిబ్బంది కూడా ప్రజలకు సూచనలు ఇవ్వడం ద్వారా ప్రమాదాల నివారణలో చైతన్యం తీసుకురావాలని కోరారు. ఏసీపీ రమేష్, ఎస్‌ఐ రమేష్, ఆర్‌ఎంఓ కృపాభాయి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వాహనాల డ్రైవర్లకు నియమాలపై అవగాహన
ఓదెల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : గుంపులలో గురువారం వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై పొత్కపల్లి ఎస్సై రమేష్ అవగాహన కల్పించారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు,లైట్లు, సిగ్నల్ వాడకం,ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలను నడపడం, సరియైున వాహనాల కాగితాలు లేకపోవడంపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండ గ్రామాల్లోని ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అతికించారు. స్టిక్కర్లు రాత్రుల్లలో మెరిసే ఉండి ప్రమాదాలను తగ్గిస్తాయని ఎస్‌ఐ రమేష్ తెలిపారు. సర్పంచ్ ఊరగొండ సమ్మక్క ట్రాక్టర్ల యజమానులు, వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.