గోదావరి పుష్కరాల పనులు చేపట్టాలి
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:19 PM
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన పనులన్నీ చేపట్టాలని పుష్కరాల ప్రత్యేక అధికారి, డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు.
మంథనిరూరల్, ఆక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన పనులన్నీ చేపట్టాలని పుష్కరాల ప్రత్యేక అధికారి, డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం మంథనిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద పనుల పురోగతిని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి, భద్రత, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారుల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వంతో పనిచేస్తూ పుష్కరాల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. .పట్టణంలోని గౌతమేశ్వరస్వామి, ఓంకారేశ్యరస్వామి, సురంబండేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అధికారులు సుప్రియ, రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.