గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:18 AM
గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్ట రేట్‌లో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అవసరమైన మౌలిక వస తుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్ట రేట్‌లో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అవసరమైన మౌలిక వస తుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో రూ.25 కోట్లతో చేపట్టే రోడ్ల అభివృద్ధి టెండర్లను త్వరగా పూర్తి చేసి, నాలుగు నెలల్లో పనులు ముగించాలని ఆదేశించారు. మంథని ఆల యాల అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరయ్యాయని, డిజైన్ ఆమో దం పొందిన పనులను వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని సూచించారు. శంకుస్థాపనలతో సంబంధం లేకుండా పనులు చేప ట్టాలన్నారు. పుష్కరాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులతో చర్చించి వారి సహకారం తీసుకోవాలని సూచించారు. పార్కింగ్ కోసం రైతులకు ఒక సీజన్ కౌలు చెల్లించి భూములను తాత్కాలికంగా లీజుకు తీసుకోవాలన్నారు. జనవరి లేదా ఫిబ్రవరి నాటికి ఘాట్ల సుందరీకరణ పూర్తి కావాలని, పారి శుధ్యం, తాగునీరు, కేశఖండనం, అన్నదాన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండ కూడదని స్పష్టం చేశారు. మంథని ఆర్‌డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, దేవాదాయ శాఖ ఏడీ సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ క్రాప్ సర్వే
త్వరగా పూర్తి చేయాలి
డిజిటల్ క్రాప్ సర్వేను జిల్లాలోని ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) పరిధిలో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ రైతులు సాగు చేసిన పంట వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీ లించి పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. ఎటువంటి తప్పుల కు తావులేకుండా గడువులోగా సర్వేను పూర్తి చేయాలని సూచిం చారు. ఒకే పంటపై ఆధారపడకుండా లాభదాయకమైన ప్రత్యా మ్నాయ, సేంద్రియ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిం చి ప్రోత్సహించాలని తెలిపారు. ఏఈవోలు రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ విత్తనాలు, ఎరువుల వినియోగం, తెగుళ్ల నివారణపై సాంకేతిక సలహాలు అందించాలని ఆదేశించారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. డీఏవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.