Share News

జీవో నంబరు 17ను వెంటనే రద్దుచేయాలి

ABN , Publish Date - May 11 , 2026 | 11:57 PM

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్‌ 17తో చిన్న తరహా కాంట్రాక్టర్ల పాలిట శాపంగా మారిం దని, తక్షణమే దానిని రద్దు చేయాలని బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్‌ దాసరి ఉష డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

జీవో నంబరు 17ను వెంటనే రద్దుచేయాలి

పెద్దపల్లి టౌన్‌, మే 11 (ఆంధ్రజ్యోతి) రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్‌ 17తో చిన్న తరహా కాంట్రాక్టర్ల పాలిట శాపంగా మారిం దని, తక్షణమే దానిని రద్దు చేయాలని బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్‌ దాసరి ఉష డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆమె మాట్లాడుతూ 15 ఏళ్లుగా గురుకుల పాఠశాలలకు నిత్యావసరాలు సరఫరా చేస్తూ, నెలకు 10 నుంచి 20 వేల రూపాయల ఆదాయంతో జీవనం సాగిస్తున్న వేలాది మంది కాంట్రాక్టర్ల పొట్టకొట్టేలా ప్రభుత్వం నిబంధనలు తెచ్చిందన్నారు. ముఖ్యంగా 30 నుంచి 50 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్‌ ఉండాలనే నిబంధనను చేర్చడం వల్ల స్థానిక చిన్న కాంట్రాక్టర్లు టెండర్లకు అనర్హులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 50 లక్షల నుంచి 2 కోట్ల రూపా యల అడ్వాన్స్‌లు చెల్లించాలని కోరడం కేవలం బడా కార్పొరేట్‌ కంపెనీ లకు మేలు చేయడానికేనని ఆమె విమర్శించారు. జీవో 17 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల మంది చిన్న తరహా కాంట్రాక్టర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నాయకులు మొలుమూరి శేఖర్‌, నల్లబెల్లి శంకర్‌, కొండి సతీష్‌, స్వప్న, అబ్దుల్‌ మాలిక్‌, అరుణ, అలు వాల రాజేందర్‌, బొల్లం భూమేష్‌, భూమయ్య, పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:57 PM