ఉద్యోగులను అభినందించిన జీఎం
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:44 PM
ఓసీపీ-1 ప్రాజెక్టుకు 2025-26 ఆర్థిక సంవత్సర నిర్దేశిత ఓవర్‌బర్డెన్ లక్ష్యాన్ని అధిగమించేలా శ్రమించిన ఉద్యోగులను ఆర్జీ-3 జీఎం మధుసూదన్ అభినందించారు. శుక్రవారం ప్రాజెక్టు సైటాఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో జీఎం ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను బహూకరించారు.
యైుటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఓసీపీ-1 ప్రాజెక్టుకు 2025-26 ఆర్థిక సంవత్సర నిర్దేశిత ఓవర్‌బర్డెన్ లక్ష్యాన్ని అధిగమించేలా శ్రమించిన ఉద్యోగులను ఆర్జీ-3 జీఎం మధుసూదన్ అభినందించారు. శుక్రవారం ప్రాజెక్టు సైటాఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో జీఎం ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను బహూకరించారు. గత వార్షిక సంవత్సరంలో 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీయాలనే లక్ష్యం ఉండగా 64.31 లక్షల క్యూబిక్ మీటర్లు ఓబీ వెలికితీసినట్టు జీఎం తెలిపారు. పనితీరుతో ఓసీపీ-1 ఉద్యోగులు ఆదర్శంగా నిలిచారని జీఎం అన్నారు. ప్రాజె క్టు విస్తరణ అనుమతుల పనులు త్వరలో పూర్తి కానున్నాయని, ఓసీపీ-1 పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా రామగుండం మెగా ఓపెన్‌కాస్ట్‌గా నడవనున్నట్టు జీఎం తెలిపారు. ఇదే నిబద్ధతతో పని చేసి మెగా ఓసీపీ ద్వారా సింగరేణి ఖ్యాతిని నిలిపేలా ఉద్యోగులు శ్రమించాలని జీఎం మధుసూదన్ తెలిపారు. అనంతరం దుర్గాదేవి ఆలయంలో అధికారులతో కలసి పూజలు చేశారు. పీఓ ప్రవీణ్ ఫాటింగ్, గుర్తింపు ప్రాతినిధ్య సంఘా ల నాయకులు ఎంఆర్‌సీ రెడ్డి , తిరుపతిరావు, రవీందర్‌రెడ్డి, గడ్డం తిరుపతి, మేనేజర్ పాప య్య, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్ ఉద్యోగులు పాల్గొన్నారు.