Share News

సమరశీల పోరాటాలకు సిద్ధంకండి

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:47 PM

కార్మికులు ఉద్యోగుల హక్కుల సాధన, చట్టాల రక్షణకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో కార్మికులచే భారీ ప్రదర్శన అనంతరం ఏఐటీ యుసీ జిల్లా స్థాయి మహాసభలను నిర్వహిం చారు.

సమరశీల పోరాటాలకు సిద్ధంకండి

సుల్తానాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కార్మికులు ఉద్యోగుల హక్కుల సాధన, చట్టాల రక్షణకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో కార్మికులచే భారీ ప్రదర్శన అనంతరం ఏఐటీ యుసీ జిల్లా స్థాయి మహాసభలను నిర్వహిం చారు. ఆమరవీరులను స్మరిస్తూ ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ బాలరాజు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహిం చిన సభలో కలవేణ శంకర్‌, బాలరాజులు మాట్లాడుతు కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభ జించి కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుం దన్నారు. ఏఐటీయుసీ దేశంలో అనేక కార్మిక సంక్షేమ హక్కుల సాధన కోసం పోరాటాలు చేసిందని, హక్కులను సాధించిందన్నారు. ప్రభుత్వాలు మారుతు న్నా కార్మికుల బతుకులు బాగుపడడం లేదని, పోరాడితే కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఉద్యోగ భద్రత ఉపాధి హక్కులు, సంక్షేమం సౌకర్యాల కోసం సమరశీల పోరాటాలకు అన్ని సంఘాలను ఐక్యం చేసి ఐక్య పోరాటాలకు పిలుపు ఇస్తామన్నారు. ఇందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌ జిల్లా నివేదికను ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. జాతీయ కౌన్సిల్‌ సభ్యులు మారగోని ప్రవీణ్‌కుమార్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, గౌతమ్‌, గోవర్ధన్‌, సూర్య, కరీం, చంద్రశేఖర్‌, శంకర్‌, లక్ష్మణ్‌, రాజరత్నం, ఎంఆర్‌సీరెడ్డి, సాంబశివరావు పాల్గొన్నారు. ప్రజా నాట్యమండలి యజ్ఞ రాజయ్య బృందం ఆలపించిన విప్లవ గీతాలు అకట్టుకున్నాయి.

Updated Date - Aug 20 , 2026 | 11:47 PM