Share News

భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:20 AM

వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలు, శాంతి, సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. పెద్దపల్లిలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాల్‌లో వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి

పెద్దపల్లి టౌన్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలు, శాంతి, సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. పెద్దపల్లిలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాల్‌లో వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్‌లైన్‌లో అనుమతి పొందాలని సూచించారు. ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని నిబంధనలు పాటించాలన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు పోలీ సులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, విద్యుత్‌ భద్రత, అగ్నిప్రమాదాల నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా మార్గం అందు బాటులో ఉంచాలన్నారు. డీజేలు, అధిక శబ్దం, అసభ్యకర కార్యక్రమాలు, మద్యం సేవించి గందరగోళం సృష్టించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశా రు. ఎక్కడైనా సమస్య తలెత్తితే నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందిం చాలని కోరారు. ప్రజల భద్రతకు పోలీస్‌ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఉత్స వాలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఏసీపీ జి. కృష్ణ, సీఐ కె. ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు నరేష్‌, మధుకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 12:20 AM