23న గణేష్ నిమజ్జనం
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:04 AM
గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం గణేష్ విగ్రహ ప్రతిష్టాపన, 23న బుధవారం నిమజ్జనం జరుపుకోవాలని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వొజ్జల వెంకటేశ్వర్లు, గోవర్ధనగిరి శశిధర్, ఉత్సవ సమితి అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాస్, కార్యదర్శి రావుల శ్రీనివాస్, వీహెచ్‌పీ విభాగ్ అయోధ్య రవీందర్ సూచించారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం గణేష్ విగ్రహ ప్రతిష్టాపన, 23న బుధవారం నిమజ్జనం జరుపుకోవాలని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వొజ్జల వెంకటేశ్వర్లు, గోవర్ధనగిరి శశిధర్, ఉత్సవ సమితి అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాస్, కార్యదర్శి రావుల శ్రీనివాస్, వీహెచ్‌పీ విభాగ్ అయోధ్య రవీందర్ సూచించారు. ఆదివారం శారదానగర్‌లోని విశ్వహిందు పరిషత్ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్‌లో నిమజ్జన కార్యక్రమం 23న జరుగుతుందని, 9రోజులు ఘనంగా గణేష్ నవరాత్రులు జరుపుకుని నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవడం హిందు సంస్కృతి, సాంప్రదాయమని, నేటి యువత మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గణేష్ మండపంలో బాల గంగాధర్ తిలక్, శివాజీమహారాజ్ చిత్రపటాలు ఏర్పాటు చేయాలని, గణేష్ ఉత్సవాల ప్రాముఖ్యతను యువకులకు తెలియజేయాలని కోరారు. మాధవరపు వెంకట్రావ్, అడిగొప్పుల రాజు, ఈసంపల్లి వెంకన్న, మునిగాల సంపత్, లలితమ్మ, భవాని, వీణ, ముష్కె సంపత్, రవీందర్, పవన్ శర్మ, వంశీ, నరేష్, జిమ్ సమ్మన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.