Share News

గాంధీ జీవన విధానం ప్రతీ ఒక్కరికి ఆదర్శం

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:58 PM

మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతీ ఒక్కరికి ఆదర్శమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గాంధీ జీవన విధానం ప్రతీ ఒక్కరికి ఆదర్శం

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతీ ఒక్కరికి ఆదర్శమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, నేటి సమాజంలో మనం తొందరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నామని, గాంధీ జీవితంలో న్యాయబద్ధంగా ఓపికతో పోరాడుతూ అనేక విజయా లు సాధించారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా జరిగిన క్విట్‌ ఇండియా, విదేశీ వస్త్రాల బహిష్కరణ మొదలగు ఉద్యమాలు ఒక్క రోజులో వచ్చినవి కావని, నిరంతరాయంగా చేసిన కృషి ఫలితంగా ఉద్య మాలు సఫలీకృతం అయ్యాయని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ జైలు శిక్షతోపాటు కష్టాలు ఎదుర్కొని పోరాడారని, దీంతో ఆశిం చిన ఫలితం లభించి దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. నేటి యువత నిరంతరాయంగా లక్ష్యం కోసం శ్రమిస్తే ఫలితం లభిస్తుందని తెలిపారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఏఓ బండి ప్రకాష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:58 PM