Share News

రూపాయికి అంత్యక్రియలు అమలుచేయాలి

ABN , Publish Date - May 07 , 2026 | 11:48 PM

రామగుండం కార్పొరేషన్‌లో రూపాయికి దహన సంస్కారాల పథకాన్ని తిరిగి ప్రారంభించాలని గురువారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

రూపాయికి అంత్యక్రియలు అమలుచేయాలి

కోల్‌సిటీ, మే 7(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో రూపాయికి దహన సంస్కారాల పథకాన్ని తిరిగి ప్రారంభించాలని గురువారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ, సోమారపు లావణ్య హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రూపాయికి అంత్యక్రియలు పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉండేదని, ఆ పథకాన్ని అర్థాంతరంగా నిలిపివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

గతంలో పని చేసిన వారికి రూ.26లక్షలు బకాయిలు ఉన్నారని, ఆ బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి సోమారపు లావణ్య మాట్లాడుతూ కార్పొరేషన్‌లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందించడంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారని, త్వరగా అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కమిషనర్‌ అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు. నాయకులు పిడుగు కృష్ణ, కొండపర్తి సంజీవ్‌, కొమ్ము శ్రీనివాస్‌, సరిత,, బూడిద రమేష్‌, నవీన్‌, ప్రవీణ్‌, రాజు, సుజశ్రీ, రఘు, శోభరాణి, అంజి, సుధ పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 11:48 PM