నియోజకవర్గంలో నిధులు వరదలా పారిస్తా
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:26 AM
సుల్తానాబాద్ పట్ట ణాన్ని మరో యాభై కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో కలసి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్ర హం వద్ద ఎన్నికల సభ నిర్వహించారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్ట ణాన్ని మరో యాభై కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో కలసి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్ర హం వద్ద ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తు ఈ ఎన్నికలలో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థు లను కౌన్సిలర్లుగా గెలిపిం చాలన్నారు. తాము అధి కారం చేపట్టిన ఈ రెండేళ్ళ లోనే సీఎంతో తనకున్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి అభివృద్ధి కోసం నిధులను నీళ్లలాగా పారించానని చెప్పుకున్నారు. వెయ్యి కోట్లతో పనులు చేయిస్తున్నట్టు చెప్పారు. గత పాలకులు ఈ పట్టణాన్ని నిర్లక్ష్యం చేస్తే సుల్తానాబాద్‌పై తనకున్న ప్రత్యేక ప్రేమ అభిమానం, తాను చదువుకున్న తిరిగిన ఊరుగా భావించి ఈ పట్టణ ప్రజలు తన ఆత్మీయులుగా భావించి కోట్లాది రూపాయలు తెచ్చి పట్టణ అభివృద్ధికి పాటుపడుతున్నట్టు చెప్పారు. నాలుగు కోట్లతో ఐబీ భవనం, మరో నాలుగు కోట్ల ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, ఎనిమిది కోట్లతో సుల్తానాబాద్ చెరువు మినీట్యాంకుగా మార్చడం, ఏడున్నర కోట్లతో ఐబీ నుంచి గట్టేపల్లి రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, ఐలాండ్స్, డివైడర్స్ లైటింగ్ ఏర్పాటు ఇలాంటి అనేక అభివృద్ది పనులు కొనసాగుతాయన్నారు. ప్రస్తుత అంబేద్కర్ చౌరస్తా వద్ద తన స్వంత ఖర్చుతో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానన్నారు. ఇలాంటి అనేక అభివృద్ది పనుల కోసం ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యరర్థులను కౌన్సిలర్లు గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్,మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ జడ్పీటీసీ డాక్టర్ అయిల రమేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.