సామాన్యులకు భారం కాకూడదనే ఉచిత కరెంట్
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:15 PM
సామాన్య, మధ్య తరగతి ప్రజల కుటుంబాలకు విద్యుత్ బిల్లులు భారం కాకూడదనే ఉద్ధేశంతో వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఉచిత కరెంట్ పథకం ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా సదస్సు నిర్వహించారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): సామాన్య, మధ్య తరగతి ప్రజల కుటుంబాలకు విద్యుత్ బిల్లులు భారం కాకూడదనే ఉద్ధేశంతో వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఉచిత కరెంట్ పథకం ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా సదస్సు నిర్వహించారు. ఇదే వార్డులో కొనసాగుతున్న ప్రజాపాలన పారిశుధ్య పనులను ప్రభు త్వ విప్ పరిశీలించారు. ఆనంతరం ఏర్పాటైన ప్రజా సదస్సులో ఆయన మాట్లాడుతు పేద ప్రజల ప్రయోజ నాల కోసం ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిం దని, వాటిని దశల వారీగా అమలు చేసిందని గుర్తు చేశా రు. ఉచిత కరెంట్ పథకం మూ లంగా లక్షలాది మంది ప్రజలు లభ్ధిపొందుతున్నారని అన్నారు.
జూన్ 2 నుంచి
ఉచిత బీమా పథకం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి రాష్ట్రం లోని తెల్ల రేషన్‌కార్డులు కలిగి ఉన్న వారం దరికీ ఉచిత బీమా పథకం అమ లు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రక టించారు. సాధారణ మరణాల విషయంలో కూడా పేద ప్రజలకు బీమా వర్తింప జేస్తా మన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, తద్వారా మహిళలు మరింత ఆర్థిక చేయూత పొందు తారన్నారు. సాధారణ మరణం పై రెండు లక్షలు, ప్రమాద మృతిపై పది లక్షల బీమా సదుపాయాన్ని ప్రభుత్వం వారికి కల్పిస్తుందన్నారు. ఐదు లక్షల జీరో వడ్డీ రుణాలు కూడా మహిళలకు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేను కౌన్సిలర్ శ్రావణి రాకేష్ సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కమిషనర్ టి రమేష్, వార్డు కౌన్సిలర్ శ్రావణి రాకేష్, రాజలింగం, తిరుపతి పాల్గొన్నారు.