Share News

రామగుండంలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్‌

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:49 PM

రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగులను పోటీపరీక్షలకు సిద్ధం చేసేందుకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యం లో హైదరాబాద్‌కు చెందిన పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ సమన్వయంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మేయర్‌ మహంకాళి స్వామి, శిక్షణ నిర్వాహకుడు జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మేయర్‌ చాంబర్‌లో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.

రామగుండంలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్‌

కోల్‌సిటీ, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగులను పోటీపరీక్షలకు సిద్ధం చేసేందుకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యం లో హైదరాబాద్‌కు చెందిన పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ సమన్వయంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మేయర్‌ మహంకాళి స్వామి, శిక్షణ నిర్వాహకుడు జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మేయర్‌ చాంబర్‌లో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. రామగుండం రూరల్‌, అర్బన్‌లో పది, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, పీజీ చదివిన నిరుద్యోగులకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరుగనున్న ఉద్యోగ నియామకాలకు సన్నద్ధం చేసేందుకు ఉచిత కోచింగ్‌ నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఫారెస్ట్‌, రెవెన్యూ, ఇతర విభాగాల్లో ఉద్యోగాలకు 70 రోజు నుంచి 90రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుంద న్నారు. గోదావరిఖని తిలక్‌నగర్‌లోని స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌తోపాటు సీఈఆర్‌ క్లబ్‌ ప్రాంగ ణంలో భవనాలను కోచింగ్‌కు వినియోగిస్తా మన్నారు. పది మంది నిష్ణాతులైన శిక్షకులతో కోచింగ్‌, రూ.5వేల విలువైన మెటీరియల్‌ను అందిస్తామని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏ తరహా పరీక్షలు నిర్వహిస్తుందో కోడింగ్‌ సిస్టంలో తెలుగు, ఇంగ్లీష్‌ భాషలో పరీక్షలు నిర్వహిస్తామ న్నారు. యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు నగరపాలక సంస్థ కార్యా లయంలో దరఖాస్తులు స్వీకరిస్తా మని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రం లోని 48 నియోజకవర్గాల్లో పీజేఆర్‌ సంస్థ ఆధ్వ ర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించా మని, ఎంతో మందికి ఉపాధి కల్పించామని సంస్థ నిర్వాహకులు జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌, కార్పొరేటర్లు దూళికట్ట సతీష్‌, గట్ల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 11:49 PM