ధాన్యం తూకంలో మోసం
ABN , Publish Date - May 15 , 2026 | 11:38 PM
గోదావరిఖని గౌతమి నగర్‌లోని శ్రీరామ రైస్‌మిల్లులో రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని తూకం వేయడంలో మోసాలకు పాల్పడు తున్నట్లు తూనికలు కొలతల శాఖ అధికారులు గుర్తిం చారు. శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు రైస్‌మిల్లులో మోసాలను గుర్తించారు. రైస్‌మిల్లును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి రఘువీర్‌సింగ్ పేర్కొన్నారు.
కోల్‌సిటీ, మే 15(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని గౌతమి నగర్‌లోని శ్రీరామ రైస్‌మిల్లులో రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని తూకం వేయడంలో మోసాలకు పాల్పడు తున్నట్లు తూనికలు కొలతల శాఖ అధికారులు గుర్తిం చారు. శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు రైస్‌మిల్లులో మోసాలను గుర్తించారు. రైస్‌మిల్లును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి రఘువీర్‌సింగ్ పేర్కొన్నారు. రామగుం డం అర్బన్, మండలంతోపాటు పాలకుర్తి మండలం లోని పలు గ్రామాల రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ గౌతమినగర్‌లోని పలు మిల్లులకు ప్రభుత్వం కేటాయించింది. పీఎసీసీఎస్ సెంటర్లలో వేసిన తూకానికి, రైస్‌మిల్లు వద్ద వేబ్రిడ్జిల వేసిన తూకాలకు భారీ తేడాలు వచ్చాయి. గురువారం జన గామ, ఎల్కలపల్లి, మారేడుపాక ప్రాంతాలకు చెందిన రైతులు శ్రీరామ రైస్‌మిల్లులో ధాన్యాన్ని తీసుకురాగా ఒక్కో లారీకి 2.3 క్వింటాళ్ళ నుంచి 3.35 క్వింటాళ్ళు తేడాలు వచ్చాయి. కొందరు రైతులు బయట వేబ్రిడ్జిల వద్ద తూకం వేయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ట్రక్ షీట్‌లో ఒక్కో ట్రాక్టర్‌కు మూడు క్విం టాళ్ళకుపైగా పెట్టారు. దీనిపై రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి రఘువీర్‌సింగ్, రామగుండం తహసీల్దార్ రవీందర్‌రావు తదితరులు రైస్‌మిల్లులో తనిఖీలు జరిపారు. వే బ్రిడ్జిలో లోపాలను గుర్తించా రు. రైస్‌మిల్ యాజమాన్యంపై తూనికలు కొలతల శాఖ అధికా రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసినట్లు తూని కల కొలతల శాఖ అధికారులు పేర్కొన్నారు. గౌతమినగర్ రైస్ మిల్లులో వచ్చిన ధాన్యాన్ని ఇప్ప టికే బస్తాకు రెండున్నర కిలోల కోతపెట్టినట్లు ఆరోపణలు వస్తు న్నాయి. ఏకంగా తూకంలో మో సాలతో ఒక్కో ట్రాక్టర్‌కు మూడు క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని తక్కువగా చూపడంతో రైతులు ట్రాక్టర్‌పై రూ.8వేలు నష్టపోయారు. జిల్లా యంత్రాంగం ఇలాంటి వాటిపై నిఽఘా పెట్టి చర్యలు తీసుకోవాలని రైతులు డి మాండ్ చేశారు. ధాన్యాన్ని మరో మిల్లుకు అప్పగించేలా సిఫార్సు చేసినట్టు తహసీల్దార్ పేర్కొన్నారు.