కంపోస్టింగ్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:15 AM
పెద్దపల్లి మున్సిపల్ కార్యా లయంలో రూ.50 లక్షలతో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ వద్ద నిర్మించే కంపోస్టింగ్ షెడ్‌కు ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమ ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి వన మహోత్స వంలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు.
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మున్సిపల్ కార్యా లయంలో రూ.50 లక్షలతో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ వద్ద నిర్మించే కంపోస్టింగ్ షెడ్‌కు ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమ ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి వన మహోత్స వంలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణానికి సం బంధించి రాఘవపూర్‌లో డంపింగ్ యార్డ్ వద్ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా కంపోస్టింగ్ షెడ్ నిర్మాణానికి టెండర్లు పూర్తి కావడంతో శంకుస్థాపన, పెద్దపల్లి పట్టణంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించామన్నారు. రెండో విడుత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, అలాగే అర్హులైన ఆర్పీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామని, పట్టణ ప్రజల సహకారంతో జెండా చౌరస్తా నుంచి మసీద్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలర్లు పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.