రోడ్డు భద్రత నియమాలు పాటించండి
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:59 PM
రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని పెద్దపల్లి డీసీపీ రాం రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఏసీపీ కృష్ణతో కలిసి రాజీవ్ రహదారిపై వాహన చోద కులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని పెద్దపల్లి డీసీపీ రాం రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఏసీపీ కృష్ణతో కలిసి రాజీవ్ రహదారిపై వాహన చోద కులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. సీటు బెల్టు ధరించి కారు నడుపుతున్న వారికి పుష్పాలు అందించి అభినందించారు. హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పుష్పాలు అందిం చారు. హెల్మెట్లు ధరించి వాహనం నడుపుతూ ప్రమాదం జరిగితే సంఘటనల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. సుల్తానాబాద్, పెద్దపల్లి సీఐలు సుబ్బారెడ్డి, చంద్రకుమార్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.