Share News

రహదారి నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:24 AM

వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అన్నారు. గర్రె పల్లిలో సోమవారం అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమా న్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ వీరగోని రమేష్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతు రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రజలను, అధికారులను భాగస్వాములను చేస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

రహదారి నిబంధనలు పాటించాలి

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అన్నారు. గర్రె పల్లిలో సోమవారం అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమా న్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ వీరగోని రమేష్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతు రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రజలను, అధికారులను భాగస్వాములను చేస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నియమ నిబంధనల గురిం చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వేగం కన్నా ప్రాణం మిన్న అనే సందేశాన్ని ప్రతీ ఒక్కరికి చేరేలా పలు రోడ్డు ప్రమాదాల వీడియో క్లిప్పింగ్‌లను అవగాహన సదస్సులో ప్రదర్శిస్తున్నామన్నారు.

ట్రాఫిక్‌ నియమాలను పాటించకపోవడం, మద్యం సేవించి వాహ నాలు నడపడం, నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతుం డగా, వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తున్న సంద ర్భాలలో జరిగినవేనని వివరించారు. ప్రమా దాలలో ప్రాణాలు పోగొట్టుకున్న బాధి తుల కుటుంబ సభ్యులు తమ దుస్థితిని తెలిపారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతు రాష్ట్రంలో యేటా ఎనిమిది వేల మంది రోడ్డు ప్రమా దాలలో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభు త్వం రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేసిం దని, మూడు నెలల నుంచి ప్రజలకు అవ గాహన కల్పిస్తున్నామన్నారు. ప్రమాదాల సమయంలో గోల్డెన్‌ అవర్‌ను సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రోడ్డు బాగా లేకపోవడం లైట్లు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి రెండు నెలల్లో మూడు కోట్ల రూపాయలను వెచ్చించామ న్నారు. రాజీవ్‌ రహదారిపై 28 చోట్ల హైమా స్ట్‌ లైట్లు, ప్రమాదాలు జరిగే స్పాట్‌లను గుర్తిం చి హెచ్చరిక బోర్టులు పెట్టామని, దాదాపు 30 శాతం ప్రమాదాలను నివారించగలిగామన్నారు. ట్రాఫిక్‌ ఏసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌, సుల్తానాబాద్‌ సీఐ సుబ్బారెడ్డి, ట్రాఫిక్‌ సీఐ అనిల్‌ కుమార్‌, ఎస్‌ఐ చంద్రకుమార్‌, తహసీల్దార్‌ బషీరొద్దిన్‌, ఎంవీఐ మధు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు పలు సూచనలతో కూడా పోస్టర్లను, కరపత్రాలను సీపీ, కలెక్టర్‌ ఆవిష్కరించారు.

Updated Date - Apr 14 , 2026 | 12:24 AM