Share News

ఘనంగా జానపద కళోత్సవాలు

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:56 PM

ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృషి కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గోదా వరిఖని ఆర్‌టీసీ డిపో సమీపంలోని ఫంక్షన్‌ హాల్‌లో జానపద కళోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా జానపద కళోత్సవాలు

కోల్‌సిటీ టౌన్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృషి కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గోదా వరిఖని ఆర్‌టీసీ డిపో సమీపంలోని ఫంక్షన్‌ హాల్‌లో జానపద కళోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కృషి కల్చరల్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసిపాక రాజమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభిం చారు. సుమారు 200 మంది కళాకారులు జానపద గీతాలు, నృత్యాలను ప్రదర్శించారు. కళాకారులందరికీ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. జానపద కళారంగంలో సేవలు అందిస్తున్న పలువురు కళాకారు లను సన్మానించారు. రాజమౌళి మాట్లాడుతూ సింగ రేణి సంస్థతోపాటు ప్రభుత్వ, సామాజిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తు న్నామని తెలిపారు. కృషి కల్చరల్‌ అకాడమీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కనకం రమణయ్య ఆలపించిన ప్రాచీన జానపద గీతాలు ఆకట్టుకున్నాయి. కళాకారులు బోడకుంట వెంకట్రాజం, అట్ల జగ్గయ్య, జనగామ శ్రీనివాస్‌, పండుగ రాజేశ్వరరావు, సిరిపు రం శ్రీనివాస్‌, బీరుక లక్ష్మణ్‌, సమాఖ్య కళాకారులు సోగాల వెంకటి, మాదరి శ్రీనివాస్‌, నాగుల శ్రీనివాస్‌, ఓసీపీ-3 అడిషనల్‌ మేనేజర్‌ పాల నరేష్‌, బతుకుల రాజన్న, గాజుల రమేష్‌, యూట్యూబ్‌ నటుడు వేముల అశోక్‌, నాట్య గురువులు సర్వేశ్‌, దేవా, ధర్మేందర్‌, సురేష్‌, ప్రశాంత్‌, విష్ణు, జనగామ పద్మ, ఆఫీసు బాయ్‌ సలిగంటి సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:56 PM