Share News

రైస్‌మిల్లుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:39 PM

రైస్‌మిల్లుల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీరాములుతో కలిసి సంబంధిత రైస్‌మిల్లర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

రైస్‌మిల్లుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలి

పెద్దపల్లి, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లుల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీరాములుతో కలిసి సంబంధిత రైస్‌మిల్లర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, బకాయిలు చెల్లించని డిఫాల్టర్‌ రైస్‌మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను గుర్తించాలని ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సంబంధిత రైస్‌మిల్లుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత రైస్‌ మిల్లర్లు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బకాయిల వసూళ్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్‌, జిల్లా జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌, డిసిఓ శ్రీమాల, ఆర్డీఓ గంగయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:39 PM