ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:07 AM
ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిం చాలని ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్‌రావు సూచించారు. మేడిపల్లి రైతువేదికలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం ’కృషి బచావో అభియాన్‘ కార్యక్రమం నిర్వహించారు
జ్యోతినగర్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిం చాలని ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్‌రావు సూచించారు. మేడిపల్లి రైతువేదికలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం ’కృషి బచావో అభియాన్‘ కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరిఖిల్లాకు చెందిన డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ తక్కువ నీటితో సాగు చేయగల పంటల ఎంపిక, యాజమాన్య పద్ధతులపై రైతుల కు అవగాహన కల్పించారు. అధిక ఆదాయం పొందేందుకు కూరగాయలు సాగు చేయాలని సూచించారు. బిందు సేద్యం, మల్చింగ్ పద్ధతులతో నీటిని ఆదా చేయడంతో పాటు కలుపు నివారణ సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయ అధికారి కాంతారావు మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల నేప థ్యంలో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నువ్వులు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమాన్ని గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించగా రైతులు వీక్షించారు.
నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలి
ముత్తారం, (ఆంధ్రజ్యోతి): సాగుభూమిని సంరక్షించుకోవడంతోపాటు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బి.శ్రీనివాస్ రైతులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభిం చిన కేతి బచావ్ అభియాన్‌లో భాగంగా ఖమ్మంపల్లి రైతువేదికలో అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి బి. శ్రీని వాస్ మాట్లాడుతూ సమతుల్య, సహజ ఎరువుల వినియోగం, నేల సారా న్ని పెంపొందించే పద్ధతులు, నీరు, ఇతర వనరుల పరిరక్షణ, సుస్థిర పోషక యాజమాన్యంపై వివరించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. అంజని, కేవీకే రామగిరి ఖిల్లా సీనియర్ సైంటిస్ట్ వెంకట రమేష్, సైంటిస్ట్ వినోద్, మం డల వ్యవసాయ అధికారి అనూ ష, వ్యవసాయ విస్తరణ అధికా రి ఎస్. శ్రీలేఖ పాల్గొన్నారు.