పట్టణ సమస్యలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:26 AM
పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన బడ్జెట్, సాధారణ సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్ మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన బడ్జెట్, సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌన్సిలర్లు వార్డు సమస్యలపై దృష్టి సారించాలని, వార్డులో ప్రజలకు మౌలిక వసతులతో పాటు తాగునీరు, పారిశుధ్యంపై దృష్టి పెట్టి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ప్రతి కౌన్సిలర్ పై ఉందన్నారు. పట్టణంలో తాగునీరుకు ఇబ్బంది లేకుండా భూగర్భ జలాలు అడుగంటి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు,మౌలిక వసతుల,అభివృద్ధి తాగునీటి సరఫరా పారిశుధ్యం రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య మాట్లాడుతూ ఎజెండా లోని మొదటి అంశం రూ.5వందలకు అంతక్రియలకు కౌన్సిలర్లు ఆమోదం తెలపడం సంతోషకరమన్నారు. పట్టణంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా రోడ్ల మనమ్మతు, వీధి దీపాల ఏర్పాటు పనులను ప్రాధాన్యంగా తీసుకొని అమలు చేస్తామన్నారు. మొత్తం 40 అంశాలపై కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. అనంతరం కౌన్సిలర్‌లను సన్మానించారు. వైస్ చైర్‌పర్సన్ ముస్కాన్ నాజ్, మేనేజర్ లింగయ్య, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్, అకౌంటెంట్ నాగవేణి, సిబ్బంది పాల్గొన్నారు.
కోతుల బెడద తీర్చండి
3వ వార్డు కౌన్సిలర్ మొలుగూరి కమల్
మూడవ వార్డులో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పిల్లలు స్కూల్‌కు వెళ్ళాలంటే బ్యాగులు, టిఫిన్ బాక్స్‌లు లాక్కుంటున్నాయి. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో ప్రయాణీకుల బ్యాగులు లాకెళ్తున్నాయి. ఈ సమస్య పట్టణంలో తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే, చైర్మన్ స్పందించి పక్షం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన కౌన్సిలర్
ఎల్లమ్మ చెరువు తూముల మరమ్మతు చేయరు అనే కథనంపై కౌన్సిలర్ మంథెన నర్సింగ్ కౌన్సిల్‌లో చర్చకు లేవనెత్తారు. పెద్దపల్లి పట్టణానికి పెద్ద ప్రమాదం ఉండడంతో పాటు రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారని, తూములు వెంటనే తెరువాలని, కబ్జాకు గురైన నాలాను బాగు చేయాలని, అక్రమ కట్టడాలని నిలిపివేయాలని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళగా ఎమ్మెల్యే, చైర్మన్, కమిషనర్ స్పందించారు.