Share News

విద్యార్థుల నైపుణ్యాలపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:12 AM

విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య అందిస్తూ నైపుణ్యాల అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావుఫూలే బాలికల డిగ్రీ కళాశాలను కలెక్టర్‌ సోమవారం పరిశీలిం చారు. కళాశాలలో ఏర్పాటు చేసిన చాం బర్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ను ప్రారంభించారు.

విద్యార్థుల నైపుణ్యాలపై దృష్టి సారించాలి

సుల్తానాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య అందిస్తూ నైపుణ్యాల అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావుఫూలే బాలికల డిగ్రీ కళాశాలను కలెక్టర్‌ సోమవారం పరిశీలిం చారు. కళాశాలలో ఏర్పాటు చేసిన చాం బర్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ను ప్రారంభించారు. అనం తరం డార్మెటరీ, వంట గదులు, తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదుల్లో బాలికలతో మాట్లాడుతు వారి విద్యాభ్యా సం, లక్ష్యాలు, భవిష్యత్తు ఆలోచనలు ప్రణాళికల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తు ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. వారి ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా కెరీర్‌ గైడెన్స్‌ అందించాలని అధ్యాపకులకు సూచించారు. ఉన్నత విద్య, వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పీజీ కోర్సులకు సంబంధించిన అవకాశాలపై వివరించాల న్నారు. టాస్క్‌ సహకారంతో విద్యార్థులకు అవసర మైన మార్గదర్శకత్వం, శిక్షణ అందించేందుకు సహ కారం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు అకాడ మిక్‌తోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కళాశాలలో వసతులు కల్పించడానికి ప్రతిపాదనలు సమర్పిం చాలని కలెక్టర్‌ అధికారులను అదేశించారు. డీసీవో మణిదీప్తి, కళాశాల ప్రిన్సిపాల్‌ వనజ పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 12:12 AM