Share News

ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:32 AM

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. హామీల అమలులో జాప్యం చేస్తే అన్ని జిల్లాల ఉద్యమకారు లను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చ రించారు.

ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం

జ్యోతినగర్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. హామీల అమలులో జాప్యం చేస్తే అన్ని జిల్లాల ఉద్యమకారు లను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చ రించారు. ఆదివారం ఎన్‌టిపిసిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకా రుల సమితి జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్‌ మాట్లాడుతూ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, ఉచిత బస్‌పాస్‌, నెలకు రూ.25 వేల పింఛన్‌, 250 గజాల ఇంటి స్థలం హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మంథని, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, చెన్నూరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 70 మంది ఉద్యమకారులు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యచ రణపై చర్చించగా, సభకు రాజయ్య అధ్యక్షత వహించారు. నాయకులు ఈదునూరి పర్వతాలు, అనుముల కళావతి, స్వరూప, నూతి తిరుపతి, తూమ్‌ పద్మ, కత్తెరమల్ల రమేష్‌, జాగటి శాంత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 12:32 AM