Share News

ఇంటింటా జ్వరాలు

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:07 AM

పట్టణం, మండలంలో సీజనల్‌ జ్వరాలు విజృం భిస్తున్నాయి. పలు గ్రామాలలో ప్రజలు జ్వరా లతో బాధపడుతున్నారు. బాధితులు ఐదారు రోజుల వరకు కోలుకోవడం లేదు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధి 12, 13, 14వ వార్డులలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది డెంగ్యూ కేసు నిర్ధారించి నివారణ చర్యలు చేపట్టారు. శనివారం భాధితుల నివా సాన్ని సందర్శించిన అధికారుల బృందం ఇల్లంతా రసాయనాలతో స్ర్పే చేశారు.

ఇంటింటా జ్వరాలు

సుల్తానాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పట్టణం, మండలంలో సీజనల్‌ జ్వరాలు విజృం భిస్తున్నాయి. పలు గ్రామాలలో ప్రజలు జ్వరా లతో బాధపడుతున్నారు. బాధితులు ఐదారు రోజుల వరకు కోలుకోవడం లేదు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధి 12, 13, 14వ వార్డులలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది డెంగ్యూ కేసు నిర్ధారించి నివారణ చర్యలు చేపట్టారు. శనివారం భాధితుల నివా సాన్ని సందర్శించిన అధికారుల బృందం ఇల్లంతా రసాయనాలతో స్ర్పే చేశారు. డాక్టర్‌ నిస్సీ క్రిస్టినా ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యురాలు మాట్లాడుతు డెం గ్యూ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పిం చారు. జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలన్నారు. కౌన్సిలర్‌ అమిరిశెట్టి శ్రావణి రాకేష్‌, హెల్త్‌ఇన్స్‌పెక్టర్‌ రాజే శ్వరరావు, మున్సిపల్‌ సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌, ఏఎన్‌ఎంలు రమాదేవి, ఆశా వర్కర్లు సుజాత, స్వరూప, కోమల, సుగుణ పాల్గొన్నారు.

కొరవడిన పారిశుధ్యం

ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, ముందు జాగ్రత్త తీసుకోకపోవడం, పారిశుధ్యం లోపంతో ఇంటింటా జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామాలలో పారిశుధ్యం నిర్వహణ అంతంత మాత్రమే ఉండడం, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు అధ్వానంగా ఉన్నాయి. దోమల బెడద తీవ్రంగా ఉన్నా నివారణ చర్యలు చేపట్టడం లేదు. డ్రై డేలు పాటించి నిల్వ నీటిని పారబో యించే కార్యక్రమాలు చేపట్టడం లేదనే విమర్శ లున్నాయి. మంచినీటి బావుల్లో క్లోరినేషన్‌ జర గడం లేదు. గ్రామాలలో అపరిశుభ్ర వాతావ రణంతో ప్రజలు జ్వరాలు బారిన పడుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి కిటకిట

జ్వరాలతో బాధపడుతున్న వారు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. నిత్యం పెద్ద ఎత్తున ప్రజలు ఔట్‌ పేషంట్లుగా వచ్చి చికిత్స పొంది మందులు తీసుకుని వెళుతుండగా పదుల సంఖ్యలో ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. రోజు ఐదారుగురు ఆసుపత్రిలో చేరుతున్నారు.

పూసాలలో ఇంటింటా జ్వరాలు

పూసాల గ్రామంలో ఇంటింటా జ్వర పీడితులు ఉన్నారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లేదు. దోమల బెడద విపరీతంగా ఉంది. తమ ఇంట్లోనే తనతో పాటు ఇద్దరు కుమారులు జ్వరాలతో ఆస్పత్రి పాలయ్యామని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్‌ పేర్కొన్నారు. అధికారులు తగిన నివారణ చర్యలు తీసుకోవాలి న్నాం.

Updated Date - Aug 30 , 2026 | 12:07 AM