ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించాలి
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:37 AM
రైతులకు నాణ్య మైన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేసి వినతిప త్రం అందించారు.
అంతర్గాం, జూన్18(ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్య మైన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేసి వినతిప త్రం అందించారు. జిల్లా కార్యదర్శి కొల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజుల వుతున్నా రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో విఫలమయ్యాయని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషన్ సిఫారసు లను అమలు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశం, నాయకులు రాజే శం, గుండు రాజయ్య, మల్యాల దుర్గయ్య, పెగడపల్లి దుర్గయ్య, ఎడ్ల రవి కుమార్, పాల్గొన్నారు.