Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:46 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో సోమ వారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచం దర్‌రావు చేపట్టనున్న దీక్షకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరిం చడంతో జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కమాన్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో సోమ వారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచం దర్‌రావు చేపట్టనున్న దీక్షకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరిం చడంతో జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కమాన్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుం దని హెచ్చరించారు. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్య త్తును ప్రశ్నార్థకంగా మార్చారన్నారు. విద్యార్థులకు బీజేపీ అండగా ఉం టుందని, ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాల ర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్‌ కుమార్‌, సౌదరి మహేందర్‌ యాదవ్‌, కాసగోని నిర్మల, బెజ్జంకి దిలీప్‌ కుమార్‌, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు చిలుక భారతి, శివంగారి సతీష్‌, భూతగడ్డ రాజకుమార్‌, పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:46 PM